“శ్రీవారి భక్తులకు బీమా భరోసా”.
తిరుమల శ్రీవారి భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం... ఎస్‌ఎస్‌డీ, రూ.300 టోకెన్లతో సంబంధం లేకుండా భక్తులకు బీమా వర్తింపు... ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం...

తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఎల్‌ఐసీలో గ్రూప్ ఇన్సూరెన్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఎస్‌ఎస్‌డీ టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో సంబంధం లేకుండా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఈ బీమా వర్తించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.
ప్రమాదవశాత్తు మరణించిన భక్తుల కుటుంబాలకు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, సాధారణ మరణానికి రూ.2 లక్షల బీమా పరిహారం అందించేలా ప్రతిపాదించినట్లు సమాచారం. భక్తుల భద్రతకు మరింత భరోసా కల్పించే దిశగా ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

