సామాన్యుడిపై ధరల భారం
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సీపీఐ నిరసన... పేద, సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈశ్వరయ్య ఆగ్రహం... ధరలను వెంటనే తగ్గించకపోతే మరింత తీవ్రంగా పోరాడతామని హెచ్చరిక...

విజయవాడ: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ విజయవాడ పంజా సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పెరుగుతున్న ధరలతో సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు.
వంట నూనె, ఉల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, దీంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని ఈశ్వరయ్య హెచ్చరించారు.

