తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైఎస్ జగన్
ప్రజల ప్రాణరక్షణకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇవ్వాలి... పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలి... సహాయక చర్యల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలి...

అమరావతి, అక్టోబర్ 28: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తుపాను నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి బాధితులకు ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మందులు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని కోరారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తుపాను కారణంగా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టడంతోపాటు పెండింగ్లో ఉన్న ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొని బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.

