ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఎన్నికల కోడ్ ముగియగానే ఇంటింటికీ ఇళ్ల పట్టాలు

విజయవాడలో 25 వేల మందికి పూర్తి హక్కులతో పట్టాల పంపిణీకి చర్యలు... తూర్పు నియోజకవర్గంలో 8,150 మందికి పట్టాలు మంజూరు చేసినట్లు వెల్లడి... వైసీపీ తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ...

V10TV న్యూస్ డెస్క్ 28 అక్టోబర్, 2026 2:50 PMకి 3,517 వీక్షణలు
ఎన్నికల కోడ్ ముగియగానే ఇంటింటికీ ఇళ్ల పట్టాలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 28 : నగరపాలక సంస్థ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పట్టాలు అందజేస్తామని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. బుధవారం విజయవాడలోని 5, 6 డివిజన్ల బూత్ కన్వీనర్లు, పార్టీ శ్రేణులతో ఆమె సమావేశమయ్యారు. ఆయా డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ సంస్థాగత పరిస్థితులు, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ విజయవాడ నగరంలో సుమారు 25 వేల మందికి పూర్తి హక్కులతో కూడిన ఇళ్ల పట్టాలు అందించే ప్రక్రియను కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 8,150 మందికి పట్టాలు మంజూరైనట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో కొంతమందికి పట్టాలు నేరుగా అందించలేకపోయామని వివరించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పట్టాలు అందజేస్తారని స్పష్టం చేశారు. కొండ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న ప్రజలు ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వారి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొండ ప్రాంతాల్లో మెట్లు, రైలింగ్‌లు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు ఇళ్ల పట్టాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గద్దె అనురాధ ఆరోపించారు. ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు నగరాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో 5, 6 డివిజన్ల కూటమి అభ్యర్థులు దాసరి మల్లేశ్వరి, దుంగా సంగీత లక్ష్మి, బూత్ కన్వీనర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం.. పునరావాస కేంద్రాలకు తరలింపు

1 గంట క్రితం 3,589

కొండ ప్రాంతాల్లో పొంచి ఉన్న ప్రమాదం.. పోలీసుల అప్రమత్తం

1 గంట క్రితం 2,843

వర్షంలోనూ ట్రాఫిక్ పోలీసుల నిరంతర అప్రమత్తత

1 గంట క్రితం 2,985

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక!

2 గంటల క్రితం 3,279