ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

వ్యాపారులకు అండగా ఉంటా!

వ్యాపారుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తా... చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు అందరికీ భరోసా... 31వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో బుద్దా వెంకన్న...

V10TV న్యూస్ డెస్క్ 15 నవంబర్, 2026 3:58 PMకి 6,888 వీక్షణలు
వ్యాపారులకు అండగా ఉంటా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 15: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వ్యాపారులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. బ్రాహ్మణ వీధిలోని ఎస్ఆర్ కల్యాణ మండపంలో 31వ డివిజన్ కార్పొరేటర్ గడ్డం బాల వెంకట రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యాపారులు నగర ఆర్థికాభివృద్ధికి వెన్నెముక వంటి వారని, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలు పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం ఉండాలని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరికీ గౌరవం, భరోసా కల్పించడమే తమ లక్ష్యమన్నారు. వ్యాపార వర్గాల సహకారంతో పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడి చంటి, నందకిషోర్ లోయ, వక్కలగడ్డ శ్రీకాంత్, అమరా మురళి, పిల్లా సుదర్శన్‌తో పాటు స్థానిక వ్యాపారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288