రైతుల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు: తుమ్మల
• రాష్ట్రంలో ఎరువుల కొరత లేదన్న మంత్రి నాగేశ్వరరావు... • యూరియా 2.79 లక్షల టన్నులు.. డీఏపీ 22 వేల టన్నుల స్టాక్... • ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలకు రాయితీ నిధులు ఈసారి నేరుగా రైతుల ఖాతాల్లోకే...

హైదరాబాద్, ఆగస్టు 29: తెలంగాణలో ఎరువుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.79 లక్షల టన్నుల యూరియా, 22 వేల టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
సాగు ఖర్చులు తగ్గించేందుకు అగ్రికల్చర్ మెకనైజేషన్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు అందించే రాయితీని ఈసారి నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ పథకం కోసం ప్రభుత్వం దాదాపు రూ.5.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

