అనారోగ్యంతో విశ్రాంతిలో పరుచూరి.. ఇంటికెళ్లి పలకరించిన బొండా ఉమా
• టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్‌కు పరామర్శ... • కాలి శస్త్రచికిత్స వివరాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా... • త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రభుత్వ విప్...

విజయవాడ, ఆగస్టు 29: తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు పరుచూరి ప్రసాద్‌ను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు శనివారం పరామర్శించారు.
ఇటీవల పరుచూరి ప్రసాద్ కాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న బొండా ఉమా ఆయన నివాసానికి వెళ్లారు. శస్త్రచికిత్స వివరాలతో పాటు ప్రస్తుతం అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
పార్టీకి, కార్మికుల సంక్షేమానికి పరుచూరి ప్రసాద్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా బొండా ఉమా ప్రస్తావించారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజా, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీఎన్టీయూసీ ప్రతినిధులు పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్నారు.

