ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన మంత్రి ఆనం
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఒక్కసారిగా స్పృహ కోల్పోయిన మంత్రి.. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో మంత్రి

ఆగస్టు 15 – V10TV AP:తిరుపతిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వేడుకల్లో ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. దీంతో పక్కనే ఉన్న అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంత్రిని పట్టుకున్నారు. అనంతరం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. ఈ ఘటనతో వేడుకల ప్రాంగణంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.

