గుడివాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
స్వేచ్ఛను బాధ్యతగా వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆర్‌సీఎం పాఠశాల, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాల అందజేత


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 – V10TV AP: ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడమే నిజమైన స్వాతంత్ర్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. దేశ ప్రగతిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పలు కార్యక్రమాల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి పతాక వందనం చేశారు. ఏలూరు రోడ్డులోని ఫాదర్ బియాంకి ఆర్‌సీఎం పాఠశాలలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు జి. జయమ్మ, మేరీ మాక్సినీ, సిస్టర్ సిసిలి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సింహాద్రి మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే రాము జాతీయ

పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందికి ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలను అందించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని రాము అన్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా స్వేచ్ఛను బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన “దేశం మనకేమిచ్చింది కాదు.. దేశానికి మనమేమిచ్చాం” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. దేశం కోసం చేసే ప్రతి మంచి పని భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. “మన ఇల్లు–మన వీధి” అనే భావనతో ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో బాధ్యతగా పనిచేయడమే నిజమైన దేశసేవ అని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

