దేశభక్తి ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలి: సీఐ లక్ష్మీనారాయణ
చిన్నారులతో కలిసి స్వాతంత్ర్య వేడుకల్లో సీఐ లక్ష్మీనారాయణ... దేశభక్తి, జాతీయ సమైక్యత ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించిన సీఐ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న లక్ష్మీనారాయణ.. నవోదయ స్కూల్ విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న పోలీసు సిబ్బంది.. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి అభినందించిన సీఐ..



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 15 ( V10TV ):విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవోదయ స్కూల్ విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి వారితో కలిసి సీఐ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులతో సీఐ లక్ష్మీనారాయణ ఆప్యాయంగా మమేకమై దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను వివరించారు. స్వాతంత్ర్యాన్ని సాధించడం వెనుక ఉన్న పోరాటం, దేశభక్తి, జాతీయ సమైక్యత, బాధ్యతాయుత పౌరులుగా


ఎదగాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి, దేశానికి సేవ చేయాలని సీఐ సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి సీఐ లక్ష్మీనారాయణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు పంచుకున్నారు. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసి వారిని అభినందించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది కూడా విద్యార్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటారు. నవోదయ స్కూల్ ఉపాధ్యాయులు సీఐ లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.

