ఆదివాసీ వేడుకల్లో సీఎం సందడి
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం సందడి... సంప్రదాయ రీతిలో చంద్రబాబుకు గిరిజనుల ఘన స్వాగతం... గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేసిన ముఖ్యమంత్రి...

అమరావతి: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆదివాసీలు సంప్రదాయ రీతిలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిరిజన మహిళలతో కలిసి చంద్రబాబు అడుగులు కలిపి నృత్యం చేశారు. గిరిజనుల సంప్రదాయాలు, కళారూపాలను ప్రతిబింబించేలా సాగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

