విజయవాడలో వాహన తనిఖీలు ముమ్మరం
రమేష్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ హెల్మెట్ ధరించని, సరైన పత్రాలు లేని వాహనదారులపై తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించిన 40 మంది వాహనదారులకు జరిమానాలు

విజయవాడ: నగరంలో ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా రమేష్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ఆదివారం ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారితో పాటు వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేని వారిని గుర్తించి తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 40 మంది వాహనదారులకు జరిమానాలు విధించినట్లు సమాచారం. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అవసరమైన పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. రహదారి భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరారు.

