ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ9, ఆగస్టు 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ట్రాఫిక్ క్రమశిక్షణకు ‘షిరీన్’ మార్క్

ప్రమాదాల నివారణే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు... ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు వాహనదారుల్లో అవగాహనకు పెద్దపీట... మహిళల భద్రతకు ‘అస్త్రం’ యాప్‌పై విస్తృత ప్రచారం... ట్రాఫిక్ సిబ్బందితో సమన్వయం.. రహదారి భద్రతపై నిరంతర పర్యవేక్షణ... ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన...

V10TV న్యూస్ డెస్క్ 9 ఆగస్టు, 2026 3:41 PMకి 1,768 వీక్షణలు
ట్రాఫిక్ క్రమశిక్షణకు ‘షిరీన్’ మార్క్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఎన్టీఆర్ జిల్లా ఆగస్టు 9 (v10 tv) విజయవాడ నగరంలో ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత పటిష్ఠం చేస్తూ, ప్రమాదాల నివారణతో పాటు ప్రజల్లో రహదారి భద్రతపై బాధ్యత పెంచే దిశగా ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిబంధనల అమలు ఒక్కటే పరిష్కారం కాదనే దృక్పథంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అవగాహనను జోడిస్తూ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టేలా ట్రాఫిక్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ప్రమాదాల నివారణే తొలి ప్రాధాన్యం..

నగర రహదారులపై ప్రమాదాలకు ఆస్కారం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ విభాగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటి అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిబంధనలు పాటించడం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి కాదని, ప్రాణాలను కాపాడుకోవడానికనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు అవగాహనకు పెద్దపీట..

ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంతోనే సరిపెట్టకుండా, ఉల్లంఘనలు జరగకుండా ముందుగానే వాహనదారుల్లో అవగాహన పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, యువతతో పాటు వివిధ వర్గాల వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నారు. పోలీసుల చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ట్రాఫిక్ క్రమశిక్షణ సాధ్యమనే దిశగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

మహిళల భద్రతకు ‘అస్త్రం’పై ప్రత్యేక దృష్టి..

మహిళలు, ప్రయాణికుల భద్రతకు ఉపయోగపడే ‘అస్త్రం’ యాప్‌ను మరింత మందికి చేరువ చేయడంపై ట్రాఫిక్ విభాగం దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సాంకేతికతను సద్వినియోగం చేసుకునేలా సూచనలు చేస్తున్నారు. మహిళల భద్రతలో ఆటో డ్రైవర్లు కూడా బాధ్యతాయుత భాగస్వాములుగా మారాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

సమన్వయంతో సురక్షిత ప్రయాణమే లక్ష్యం .

నగరంలో ట్రాఫిక్ సమస్యలను గుర్తిస్తూ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయం పెంచడంపై డీసీపీ షిరీన్ బేగం దృష్టి సారిస్తున్నారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణతో పాటు ప్రజలకు ఇబ్బందులు తగ్గించేలా ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహించాలని సూచిస్తున్నారు. నిబంధనల అమలు, ప్రజల్లో అవగాహన, సిబ్బంది సమన్వయం అనే మూడు అంశాలను కలిపి ప్రతి వాహనదారుడికి సురక్షిత ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ట్రాఫిక్ విభాగానికి దిశానిర్దేశం చేస్తున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

రౌడీషీటర్లకు సీఐ స్ట్రాంగ్ వార్నింగ్

3 గంటల క్రితం 123

ఆదివాసీ వేడుకల్లో సీఎం సందడి

3 గంటల క్రితం 231

విజయవాడలో వాహన తనిఖీలు ముమ్మరం

3 గంటల క్రితం 157

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం

3 గంటల క్రితం 185