రౌడీషీటర్లకు సీఐ స్ట్రాంగ్ వార్నింగ్
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే నగర బహిష్కరణకు చర్యలు

విజయవాడ: నగరంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించారు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గత ప్రవర్తనను మార్చుకుని చట్టానికి లోబడి జీవించాలని సూచించారు. గంజాయి, మద్యం తదితర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అవసరమైతే నగర బహిష్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించారు.

