ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఐదు డివిజన్లలో బొండా రవితేజ విస్తృత ప్రచారం

61, 84, 83, 80, 82వ డివిజన్లలో ఎన్నికల ప్రచార సందడి… కూటమి అభ్యర్థులతో కలిసి ఇంటింటికీ వెళ్లిన టీడీపీ యువనేత… నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యమని వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 11:58 AMకి 5,371 వీక్షణలు
ఐదు డివిజన్లలో బొండా రవితేజ విస్తృత ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 30: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ఐదు డివిజన్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ యువనేత బొండా రవితేజ శుక్రవారం విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను, వ్యాపారులను కలిశారు. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రచారం సాగించారు. 61వ డివిజన్ గిరిపురంలోని శికామణి సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రచారం 84వ డివిజన్ రాధానగర్, 83వ డివిజన్ సుందరయ్యనగర్ పార్టీ కార్యాలయం, 80వ డివిజన్ వాంబే కాలనీ గాంధీబొమ్మ సెంటర్, 82వ డివిజన్ పాయకాపురం ప్రాంతాల్లో కొనసాగింది. ఆయా డివిజన్లలో కూటమి కార్పొరేటర్ అభ్యర్థులతో కలిసి రవితేజ ప్రజలను కలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ విజయవాడ నగర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నగరంలో రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వివరించాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతోపాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

79వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి శిరీష ప్రచారం

40 నిమిషాల క్రితం 5,691

85వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ భారీ రోడ్‌షో

46 నిమిషాల క్రితం 6,580

మూడు డివిజన్లలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం

2 గంటల క్రితం 6,872

అమెరికాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత!

2 గంటల క్రితం 4,563