ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మూడు డివిజన్లలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం

73, 74, 68వ డివిజన్లలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే… మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని హామీ… నగర సమగ్ర అభివృద్ధే కూటమి లక్ష్యమని వెల్లడి…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 11:49 AMకి 6,872 వీక్షణలు
మూడు డివిజన్లలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 30: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 73, 74, 68వ డివిజన్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శుక్రవారం విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయా డివిజన్లలో పర్యటిస్తూ ప్రజలను కలిశారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేపట్టారు. 73వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట జీ ప్లస్ అపార్ట్‌మెంట్స్ బస్టాప్ వద్ద ప్రారంభమైన ప్రచారం టీడీపీ కార్యాలయం, కనకదుర్గమ్మ గుడి మీదుగా సింగ్‌నగర్ వెళ్లే మార్గంలో కొనసాగింది. అనంతరం 74వ డివిజన్‌లో గుండపు చలపతిరావు వీధి నుంచి తోటవారి వీధి మీదుగా విశాల్ మార్ట్ వరకు పర్యటించారు. 68వ డివిజన్‌లో పసుపుతోట రాములవారి గుడి నుంచి ఒకటి, రెండు రోడ్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందన్నారు. నగరంలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విజయవాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు. నగర అభివృద్ధి కోసం ఎన్డీయే కూటమి కార్పొరేటర్ అభ్యర్థులతోపాటు మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

79వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి శిరీష ప్రచారం

41 నిమిషాల క్రితం 5,691

85వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ భారీ రోడ్‌షో

48 నిమిషాల క్రితం 6,580

ఐదు డివిజన్లలో బొండా రవితేజ విస్తృత ప్రచారం

1 గంట క్రితం 5,371

అమెరికాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత!

2 గంటల క్రితం 4,563