ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

85వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ భారీ రోడ్‌షో

బట్టి వెంకటేశ్వరరావుకు మద్దతుగా విస్తృత ప్రచారం… కూటమి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన యువనేత… డివిజన్ అభివృద్ధికి ఎన్డీఏ గెలుపు అవసరమని పిలుపు…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 12:38 PMకి 6,581 వీక్షణలు
85వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ భారీ రోడ్‌షో — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 30: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 85వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకటేశ్వరరావుకు మద్దతుగా టీడీపీ యువనేత బొండా సిద్ధార్థ శుక్రవారం భారీ రోడ్‌షో నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలు, వ్యాపారులను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే ఎన్నికల్లో బట్టి వెంకటేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేదల సంక్షేమం, మహిళల అభ్యున్నతి, యువతకు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విజయవాడను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలంటే నగరపాలక సంస్థలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. 85వ డివిజన్‌లో ప్రజల సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే బట్టి వెంకటేశ్వరరావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో విజయవాడ నగరపాలక సంస్థపై ఎన్డీఏ కూటమి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

79వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి శిరీష ప్రచారం

1 గంట క్రితం 5,692

ఐదు డివిజన్లలో బొండా రవితేజ విస్తృత ప్రచారం

2 గంటల క్రితం 5,371

మూడు డివిజన్లలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం

2 గంటల క్రితం 6,873

అమెరికాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత!

2 గంటల క్రితం 4,563