ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

79వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి శిరీష ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన వేమూరి శిరీష… గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన అభ్యర్థి… ధరల పెరుగుదల, బుడమేరు వరదలపై కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన శిరీష…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 12:45 PMకి 5,706 వీక్షణలు
79వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి శిరీష ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 30: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 79వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వేమూరి శిరీష శుక్రవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలిశారు. కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. పేదలు, మహిళలు, సామాన్య కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి గత ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. బుడమేరు వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించిన ఆమె, కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచారంలో వైసీపీ నాయకులు హరేంద్ర, అమిత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

85వ డివిజన్‌లో బొండా సిద్ధార్థ భారీ రోడ్‌షో

2 గంటల క్రితం 6,583

ఐదు డివిజన్లలో బొండా రవితేజ విస్తృత ప్రచారం

3 గంటల క్రితం 5,371

మూడు డివిజన్లలో బొండా ఉమా ఎన్నికల ప్రచారం

3 గంటల క్రితం 6,873

అమెరికాలో సీనియర్ ఐపీఎస్ అధికారి కన్నుమూత!

3 గంటల క్రితం 4,563