మూసీ సుందరీకరణకు తొలి అడుగు
▪️ రూ.7,055 కోట్లతో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు అనుమతులు... ▪️ తొలి దశలో 21 కిలోమీటర్ల మేర నది అభివృద్ధికి ప్రణాళిక... ▪️ ఇరువైపులా రోడ్లు, పార్కులు, చెక్‌డ్యామ్‌లతో హైదరాబాద్‌కు కొత్త రూపు...

హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. సుమారు రూ.7,055 కోట్లతో చేపట్టనున్న మొదటి దశ పనులకు రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా అథారిటీ కీలక అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. 2027 నాటికి 21 కిలోమీటర్ల మేర నదిని అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. నదికి ఇరువైపులా రోడ్లు, పార్కులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పాటు మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ మహానగరంలో మూసీ పరివాహక ప్రాంతానికి కొత్త రూపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

