విజేతలకు ఆత్మీయ అభినందనల వెల్లువ!
వంగవీటి రాధాకృష్ణ విజయంపై రంగా అభిమానుల హర్షం... మచిలీపట్నం మేయర్ అబీద, కూటమి కార్పొరేటర్లకు ఘన సత్కారం... ఆర్ఎస్ఆర్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సమావేశం...

మచిలీపట్నం, నవంబర్ 14: విజయవాడ నగర మేయర్గా వంగవీటి రాధాకృష్ణ, మచిలీపట్నం మేయర్గా అబ్దుల్ అబీదతో పాటు కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సందర్భంగా మచిలీపట్నంలో ఆత్మీయ అభినందన సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగవీటి రాధా–రంగా మిత్రమండలి అధ్యక్షుడు రాయగిరి శ్రీరామ్ మోహన్ రావు (ఆర్ఎస్ఆర్) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజేతలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఆర్ మాట్లాడుతూ తమ ఆరాధ్య నాయకుడు దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మేయర్గా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రంగా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో రాధాకృష్ణ మరింత కీలక పాత్ర పోషిస్తారని ఆకాంక్షించారు. మచిలీపట్నంలో మేయర్గా విజయం సాధించిన అబ్దుల్ అబీదతో పాటు జనసేన పార్టీ నుంచి గెలుపొందిన 10వ వార్డు కొట్టే వెంకట్రావు, 9వ వార్డు సాయన శేషుకుమారి, 11వ వార్డు తిరుమలశెట్టి నాగరాజు, 2వ వార్డు మణిబాబులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఆర్ఎస్ఆర్ కోరారు. మచిలీపట్నం అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా రంగా అభిమానులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మేయర్ అబ్దుల్ అబీద, అసిన్ బేగ్, మిత్రమండలి గౌరవ అధ్యక్షుడు మాదివాడ రాము, గౌరవ సలహాదారు కొట్టే వెంకట్రావు, డాక్టర్ రాధిక మాధవి, వాలిశెట్టి రవి, కొనకళ్ల నాగరాజు, సాయిని శివయ్య, వాలిశెట్టి వెంకటేశ్వరరావు, వాలిశెట్టి విమానిష్, తిరుమలశెట్టి నాగరాజు, ఈవన మణిబాబు, నీరజ, మానేపల్లి ఉషారాణి, వినకోట సంధ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రమండలి కమిటీ సభ్యులు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

