ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ19, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఉద్యోగాల పునరుద్ధరణ కోరుతూ అర్బన్ ఈ-సేవ ఉద్యోగుల ర్యాలీ

ఆగస్టు 17 నుంచి 20 వరకు ఉద్యోగ సాధన దీక్షలు... 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్... యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఉద్యోగుల విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 19 ఆగస్టు, 2026 4:41 PMకి 1,145 వీక్షణలు
ఉద్యోగాల పునరుద్ధరణ కోరుతూ అర్బన్ ఈ-సేవ ఉద్యోగుల ర్యాలీ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 19: ఉద్యోగాల పునరుద్ధరణ కోరుతూ అర్బన్ ఈ-సేవ ఉద్యోగులు విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఐటీ (మీ) సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 17 నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగ సాధన దీక్షలు చేపట్టారు.

పటమట రైతుబజార్ నుంచి ESD కార్యాలయం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగాలను పునరుద్ధరించాలని కోరుతూ డైరెక్టర్ శివప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా తమకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.

తమ కుటుంబాల జీవనాధారం ఉద్యోగాలపైనే ఆధారపడి ఉందని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఉద్యోగాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు ఏపీ నాగేశ్వరరావు, సీహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

స్థానిక సమరానికి సై అంటున్న జగన్!

1 గంట క్రితం 1

విజయవాడ పశ్చిమకు రూ.55 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు

2 గంటల క్రితం 1,214

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

2 గంటల క్రితం 2,145

విజయవాడలో రూ.24 కోట్ల ‘కార్పొరేట్’ భారీ మోసం!

5 గంటల క్రితం 1,125