విజయవాడ పశ్చిమకు రూ.55 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు
పశ్చిమ నియోజకవర్గంలో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు... భవానీపురం, లారీ స్టాండ్ ప్రాంతాల్లో నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రణాళిక... ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో రూ.55 కోట్ల నిధులు కేటాయింపు...

విజయవాడ, ఆగస్టు 19: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు రూ.55 కోట్లతో నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు సమాచారం.
భవానీపురం, లారీ స్టాండ్ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంకుల ప్రాంతాలను కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, మెగా ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రతిపాదిత వాటర్ ట్యాంకుల నిర్మాణానికి అనువైన ప్రదేశాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించినట్లు తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రూ.55 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

