అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి
రెండో విడతలో అర్హులైన పేదలకు త్వరలోనే ఇళ్ల మంజూరు... కబ్జాలు తొలగించి పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తామని వెల్లడి... CURE పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 3 వరకు అవకాశం...

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలకు త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు.
కబ్జాలకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన సమావేశంలో మంత్రి ఈ విషయాలను వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
మరోవైపు CURE పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో అర్హులైన కుటుంబాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ‘మీసేవ’ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు

