విజయవాడలో రూ.24 కోట్ల ‘కార్పొరేట్’ భారీ మోసం!
ఎల్ కంపెనీల ద్వారా తప్పుడు సమాచారం సమర్పించి యూనియన్ బ్యాంకు నుంచి భారీ రుణం... రూ.24 కోట్ల రుణం పొందిన వ్యవహారంపై యూనియన్ బ్యాంకు AGM ఫిర్యాదు... రెండు కంపెనీల డైరెక్టర్లు, బ్యాంకు ఉద్యోగిపై కేసు నమోదు చేసిన సీబీఐ...

విజయవాడ క్రైమ్, ఆగస్టు 19: విజయవాడలో ఎల్ కంపెనీల ద్వారా తప్పుడు సమాచారం సమర్పించి యూనియన్ బ్యాంకు నుంచి సుమారు రూ.24 కోట్ల రుణం పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై యూనియన్ బ్యాంకు ఏజీఎం సీబీఐకి ఫిర్యాదు చేశారు.
రూ.24 కోట్ల రుణం పొందిన ఆరు నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. రుణం మంజూరు, నిధుల వినియోగం తదితర అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులు సీబీఐని ఆశ్రయించారు.
ఫిర్యాదు ఆధారంగా ఓంకార విజయలక్ష్మి స్పైసెస్ కంపెనీకి చెందిన డైరెక్టర్లతో పాటు సంబంధిత బ్యాంకు ఉద్యోగిపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు సమాచారం.
రుణం పొందేందుకు సమర్పించిన పత్రాలు, అందులో పేర్కొన్న వివరాలు, నిధుల వినియోగం, బ్యాంకు ఉద్యోగి పాత్ర తదితర అంశాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.
