మైలవరంలో 5 వేల కుటుంబాలకు చేరిన ‘ఇంటింటికి తెలుగుదేశం’
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో కొనసాగుతున్న కార్యక్రమం... లంక లితీష్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల వివరణ... ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పార్టీ శ్రేణుల విస్తృత ప్రచారం...

మైలవరం: మైలవరం పట్టణంలో ‘ఇంటింటికి తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాలతో, లంక లితీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 5,000 కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నారు. అదే సమయంలో స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వాటిని సంబంధిత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో చారుగుండ్ల ప్రసాద్, జల్లి కృష్ణ, షేక్ బాజీ, మండవ రాజేష్, బుడిపూడి వెంకట్రావు, పెరికల సాంబయ్య, యూనిట్ ఇన్‌చార్జి తాళ్లూరు మధు, తాళ్లూరి శేషగిరిరావు, గుండుబోయిన రమణ, నూతక్కి సతీష్, తోమ్ముండ్రు ఎలిజేరు, సభావత్ సాంబశివరావు, పేయ్యాల జనత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలతో మమేకమవుతూ సంక్షేమం, అభివృద్ధి అంశాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని మరింత విస్తరించనున్నట్లు నాయకులు తెలిపారు.
