మెరుగైన వైద్యం కోసం రూ.11.70 లక్షల ఎల్ఓసీలు
ఇద్దరు బాధితులకు వైద్య చికిత్స కోసం ఆర్థిక భరోసా... సుజనా చౌదరి ఆదేశాలతో ఎల్ఓసీ పత్రాల అందజేత... భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు పత్రాలు అందించిన నేతలు...

విజయవాడ: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఇద్దరు బాధితులకు మొత్తం రూ.11.70 లక్షల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) పత్రాలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు.
56వ డివిజన్ రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్ రబియా బస్రీ (48) వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.7 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైంది. అలాగే 45వ డివిజన్ సితార సెంటర్కు చెందిన బైరం షబానా (38) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వైద్య సహాయం కోరగా రూ.4.70 లక్షల ఎల్ఓసీ మంజూరు చేశారు.
వైద్య సహాయం కోసం చేసిన విజ్ఞప్తులపై త్వరితగతిన స్పందించి ఎల్ఓసీలు మంజూరు చేయించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు నున్న కృష్ణ, కూటమి నేతలు కందుల సుబ్రమణ్యేశ్వరరావు, బొమ్ము రాంబాబు, బొమ్ము గోవిందమ్మ, పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, పగడాల కృష్ణ, పైలా సురేష్, పిట్టల గోవిందు తదితరులు పాల్గొన్నారు.

