రాష్ట్రానికి మరో ఆరు లక్షల ఇళ్లు
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీ… ఇప్పటికే తొమ్మిది లక్షల ఇళ్లకు కేంద్రం అనుమతి… మూడు, నాలుగు నెలల్లో మరో మూడు లక్షల ఇళ్లు పూర్తి…

విజయవాడ, అక్టోబర్ 4: రాష్ట్రానికి మరో ఆరు లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ మేరకు హామీ ఇచ్చారని వెల్లడించారు. రాష్ట్రానికి తొమ్మిది లక్షల ఇళ్లను మంజూరు చేయాలని అడిగామని, ప్రస్తుతం మూడు లక్షల ఇళ్లకు అంగీకారం లభించిందని చెప్పారు. మిగిలిన మూడు లక్షల ఇళ్లను వచ్చే ఏడాది మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారని పేర్కొన్నారు. ఇప్పటికే మంజూరైన వాటిలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో మూడు లక్షల ఇళ్లను మూడు నుంచి నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చంద్రబాబు వివరించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌కే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కూ మామేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

