మైకులతో పోలీసుల హెచ్చరిక
అజిత్‌సింగ్‌నగర్‌లో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాలతో ఇంటింటికీ కరపత్రాల పంపిణీ పోలీసు వాహనాల మైకుల ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు హెచ్చరిక

విజయవాడ క్రైమ్ ఆగస్టు 21 : సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచే చర్యలను విస్తృతం చేశారు. ఇందులో భాగంగా పోలీసులు ఇంటింటికీ వెళ్లి సైబర్ నేరాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా పోలీసు వాహనాలకు ఏర్పాటు చేసిన మైకుల ద్వారా వీధుల్లో తిరుగుతూ సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలు, వాటి నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. రోజురోజుకూ కొత్త రూపాల్లో సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద ఫోన్‌కాల్స్, లింకులు, ఆన్లైన్ ఆఫర్లు, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు కోరే సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరాల నివారణలో ప్రజల అప్రమత్తతే కీలకమని పేర్కొంటూ ఈ అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

