కేతవీరునిపాడులో కోదండ రామస్వామి ఆలయానికి శంకుస్థాపన
ఆధ్యాత్మిక కేంద్రంగా కేతవీరునిపాడు గ్రామం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా భూమిపూజ కోదండ రామస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష

నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కోదండ రామస్వామి దేవస్థానానికి శుక్రవారం శంకుస్థాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో జరిగింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి కార్యక్రమానికి హాజరై ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ కోదండ రామస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నూతన ఆలయ నిర్మాణంతో కేతవీరునిపాడులో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందుతుందని పేర్కొన్నారు. ఆలయాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. కోదండ రామస్వామి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తై గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలని సౌమ్య ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

