ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ17, నవంబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సోనియా ఆత్మకథ భావితరాలకు స్ఫూర్తి!

గిడుగు రుద్రరాజు చేతుల మీదుగా పుస్తకం అందుకున్న వేముల శ్రీనివాస్... సోనియా జీవిత ప్రయాణం, త్యాగాలకు అద్దం పట్టిన ఆత్మకథ... దేశ సమైక్యత కోసం గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయం...

V10TV న్యూస్ డెస్క్ 15 నవంబర్, 2026 7:40 PMకి 7,829 వీక్షణలు
సోనియా ఆత్మకథ భావితరాలకు స్ఫూర్తి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 15: కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆత్మకథ భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు చేతుల మీదుగా ఆయన ఈ పుస్తకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సోనియా గాంధీ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయ ప్రస్థానంలో ఎదురైన సవాళ్లు, కుటుంబం కోసం చేసిన త్యాగాలను ఈ ఆత్మకథలో వివరించారని తెలిపారు. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ దేశాన్ని తన మాతృభూమిగా భావించారని కొనియాడారు. రాజీవ్ గాంధీ మరణానంతరం అనేక రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం వచ్చినా స్వీకరించకుండా త్యాగానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం గాంధీ కుటుంబం చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ నాయకత్వం వరకు సాగిన ప్రయాణాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని చెప్పారు. అటువంటి గొప్ప నాయకురాలి ఆత్మకథను అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ పుస్తకాన్ని అందజేసిన గిడుగు రుద్రరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!

4 గంటల క్రితం 6,984

అమిత్ షా పర్యటన వేళ.. డ్రోన్లకు నో ఎంట్రీ!

6 గంటల క్రితం 7,166

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం!

6 గంటల క్రితం 6,483

కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!

7 గంటల క్రితం 7,288