ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, అక్టోబర్ 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక!

సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం… రేపు సాయంత్రానికి అల్పపీడనం తుపానుగా బలపడే సూచనలు… తీరప్రాంతాల్లో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం…

V10TV న్యూస్ డెస్క్ 31 అక్టోబర్, 2026 3:00 PMకి 6,490 వీక్షణలు
ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. ఇది రాబోయే ఆరు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని, ఆదివారం సాయంత్రానికి మరింత బలపడి తుపానుగా మారవచ్చని తెలిపింది. సోమవారం సాయంత్రానికి తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంగా చేరుకునే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

చంద్రబాబు నాయకత్వంలో విజయవాడ అభివృద్ధికి మహర్దశ: బొండా ఉమా

22 నిమిషాల క్రితం 12,390

లారీ ఢీకొని కారు నుజ్జునుజ్జు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

2 గంటల క్రితం 5,693

రాప్తాడులో దారుణం.. బాధిత విద్యార్థిని తల్లికి సీఎం చంద్రబాబు ధైర్యం

2 గంటల క్రితం
6,893

ఇద్దరు పోలీసు సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు

3 గంటల క్రితం 7,617