ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ19, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

డేటా సెంటర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి లోకేష్

విశాఖ డేటా సెంటర్లపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శ... గూగుల్ వంటి దిగ్గజ సంస్థల రాకతో విశాఖ ఐటీ రంగానికి కొత్త ఊపు వస్తుందని వెల్లడి... డేటా సెంటర్లతో ఏఐ టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం...

V10TV న్యూస్ డెస్క్ 19 ఆగస్టు, 2026 11:58 AMకి 1 వీక్షణలు
డేటా సెంటర్లపై దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి లోకేష్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, ఆగస్టు 19: విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లపై వైసీపీ నేతలు అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. అసెంబ్లీలో డేటా సెంటర్ల అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం విశాఖను ఐటీ రంగంలో ఎంతవరకు అభివృద్ధి చేసిందో చెప్పాలని ప్రశ్నించిన లోకేష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ కేంద్రంగా డేటా సెంటర్లు ఏర్పాటైతే ఏఐ టెక్నాలజీతో పాటు డిజిటల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

విశాఖలో ఇప్పటికే ఏఐ ఆధారిత డేటా సెంటర్ల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. గతంలో సిఫీ సంస్థ రూ.1,500 కోట్ల పెట్టుబడితో 50 మెగావాట్ల ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌ను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించగా, దీని ద్వారా సుమారు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడైంది.

డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ అవసరమవుతుందని, అందుకోసం ప్రత్యేక విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. విద్యుత్‌కు సంబంధించిన వ్యయాన్ని డేటా సెంటర్ సంస్థలే భరించే విధంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలపై అదనపు భారం పడుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, యువతకు ఉద్యోగాలు లభించడం, విశాఖను అంతర్జాతీయ ఐటీ–ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో రాజకీయ విమర్శల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో యువతికి రూ.8.06 లక్షల టోకరా

28 నిమిషాల క్రితం 0

రాజమండ్రి నేతలతో భేటీ కానున్న వైఎస్ జగన్

45 నిమిషాల క్రితం 1

పాతికేళ్ల భూ సమస్యకు తెర.. లోకేష్ చొరవతో శాశ్వత పరిష్కారం

2 గంటల క్రితం 2,146

‘ఉత్తమ అధికారి’కి ఏసీబీ షాక్.. రూ.15 వేల లంచంతో చిక్కిన ఆర్‌ఐ!

2 గంటల క్రితం 1,453