రాజమండ్రి నేతలతో భేటీ కానున్న వైఎస్ జగన్
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం... రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ నేతలతో జగన్ ముఖాముఖి... పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజా సమస్యలపై చర్చ...

తాడేపల్లి, ఆగస్టు 19: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో భేటీ కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం.
నియోజకవర్గంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు తదితర అంశాలపై జగన్ నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతల అభిప్రాయాలను జగన్ తెలుసుకోనున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను మరింత సమన్వయం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

