ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ19, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో యువతికి రూ.8.06 లక్షల టోకరా

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ ప్రకటనతో సైబర్ నేరగాళ్ల వల... చిన్న మొత్తాలు చెల్లించి నమ్మకం కలిగించి.. ఆపై వివిధ టాస్కుల పేరుతో డబ్బులు వసూలు... మోసపోయానని గుర్తించిన బాధితురాలు మాచవరం పోలీసులకు ఫిర్యాదు...

V10TV న్యూస్ డెస్క్ 19 ఆగస్టు, 2026 12:22 PMకి 1,479 వీక్షణలు
పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో యువతికి రూ.8.06 లక్షల టోకరా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ క్రైమ్, ఆగస్టు 19: పార్ట్‌టైమ్ ఉద్యోగం పేరుతో ఓ యువతిని సైబర్ నేరగాళ్లు మోసం చేసి రూ.8.06 లక్షలకు పైగా కాజేసిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన చూసిన యువతి అందులో పేర్కొన్న వివరాలను నమ్మింది. ఉద్యోగం కోసం వెతుకుతున్న బాధితురాలిని సైబర్ నేరగాళ్లు సంప్రదించి, కొన్ని టాస్కులు పూర్తి చేస్తే ఆదాయం వస్తుందని నమ్మించారు.

తొలుత చిన్న మొత్తాలకు సంబంధించిన టాస్కులు ఇచ్చి, వాటికి డబ్బులు చెల్లించడం ద్వారా బాధితురాలిలో నమ్మకం కలిగించారు. అనంతరం మరింత లాభం వస్తుందంటూ వివిధ టాస్కుల పేరుతో విడతల వారీగా నగదు చెల్లించాలని సూచించారు.

వారి మాటలు నమ్మిన యువతి పలు విడతల్లో మొత్తం రూ.8,06,876 చెల్లించింది. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించి మాచవరం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సైబర్ మోసాలకు చెక్.. అందుబాటులోకి ప్రత్యేక యాప్

16 నిమిషాల క్రితం 0

త్వరలో కొత్త రాజకీయ పార్టీ: విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన

31 నిమిషాల క్రితం 0

ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించాలి: ఎన్టీఆర్ కలెక్టర్

39 నిమిషాల క్రితం 1

రాజమండ్రి నేతలతో భేటీ కానున్న వైఎస్ జగన్

2 గంటల క్రితం 1,256