ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ3, సెప్టెంబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

దండం పెట్టి.. దోచుకెళ్లాడు!

షట్టర్ ధ్వంసం చేసి దుకాణంలోకి ప్రవేశం... కుర్చీలో దర్జాగా కూర్చొని నగదు తీసుకెళ్లిన వైనం... రూ.30 వేల నగదు, ఇతర వస్తువులు చోరీ.. సీసీ కెమెరాలో రికార్డు...

V10TV న్యూస్ డెస్క్ 3 సెప్టెంబర్, 2026 11:13 AMకి 3,255 వీక్షణలు
దండం పెట్టి.. దోచుకెళ్లాడు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఉరవకొండ: దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి చేసిన పని చూసి బాధితుడితో పాటు పోలీసులు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. దుకాణంలోకి చొరబడిన దొంగ.. చోరీ ప్రారంభించే ముందు అక్కడున్న వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి నమస్కరించి, ఆ తర్వాత నగదు దోచుకెళ్లిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

బాధితుడి వివరాల ప్రకారం.. కుప్పంకు చెందిన మొగన్ ఉరవకొండ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమీపంలోని ప్రధాన రహదారి పక్కన బిగ్ బజార్ నిర్వహిస్తున్నారు. గత నెల 31వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తి దుకాణం షట్టర్‌ను ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించాడు.

క్యాష్ కౌంటర్ వద్దకు చేరుకున్న దొంగకు అక్కడ ఉన్న వేంకటేశ్వరస్వామి చిత్రపటం కనిపించింది. వెంటనే స్వామివారికి చేతులు జోడించి నమస్కరించాడు. అనంతరం అక్కడున్న కుర్చీలో దర్జాగా కూర్చొని క్యాష్ కౌంటర్‌లోని నగదును తీసుకొని వెళ్లిపోయాడు. ఈ తతంగమంతా దుకాణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.

రూ.30 వేల నగదుతో పాటు మరికొన్ని వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ముందు మున్సిపల్‌.. ఆపై పరిషత్‌ పోరు!

35 నిమిషాల క్రితం 0

బస్సెక్కే వేళ.. వృద్ధురాలి పర్సుకు కన్నం!

56 నిమిషాల క్రితం 1,128

దళిత కుటుంబంపై దాడి.. ఇంటికి తాళం!

1 గంట క్రితం 2,353

ఆహార కమిషన్ తనిఖీ.. బయటపడ్డ లోపాలు

1 గంట క్రితం 1,235