వెలిగొండకు ‘జలహారతి’.. చంద్రబాబు హర్షం
రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో మైలురాయిగా అభివర్ణించిన సీఎం... సుదీర్ఘ ప్రజాజీవితంలో ఇదో కొత్త అనుభూతి అంటూ వ్యాఖ్య... ప్రత్యేక పూజల అనంతరం సాగునీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి...

అమరావతి/వెలిగొండ, సెప్టెంబరు 5 (ఆంధ్రప్రభ): వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటికి హారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేశారు.
వెలిగొండ, పూలవరం ఎడమ కాలువలను ప్రారంభించడం రాష్ట్ర ఇరిగేషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఇది ఒక కొత్త అనుభూతిని కలిగించిందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నీటికి పూజలు చేసి హారతి ఇచ్చారు. సాగునీరు అందించడం తనకు గొప్ప వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

