ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సూర్యమణి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

80వ డివిజన్‌లో హోరెత్తిన ఎన్డీయే కూటమి ప్రచారం… ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించిన గద్దె అనురాధ… అభివృద్ధి, సంక్షేమానికి కూటమితోనే భరోసా అంటూ ప్రచారం…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 7:40 PMకి 5,908 వీక్షణలు
సూర్యమణి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 30: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 80వ డివిజన్‌లో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బెవర సూర్యమణి విజయమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలుతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఓటరును కలవాలని కార్యకర్తలకు సూచించారు. 80వ డివిజన్ అభివృద్ధికి బెవర సూర్యమణిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్ అభ్యర్థి బెవర సూర్యమణికి సైకిల్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో బెవర నారాయణ, కంచేటి నాగరాజు, బెవర సూర్య, బాలాజీ, ధర్మాన రాముతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

78వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కనకదుర్గ ఇంటింటి ప్రచారం

16 నిమిషాల క్రితం 6,894

పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు.. కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

1 గంట క్రితం 6,986

సంక్షేమమే అజెండాగా దాసరి ఉదయ్ శ్రీ ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం
4,602

ఎన్నికల వేళ బెజవాడలో ఆంక్షల కంచె!

2 గంటల క్రితం 5,968