ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ30, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సంక్షేమమే అజెండాగా దాసరి ఉదయ్ శ్రీ ఎన్నికల ప్రచారం

82వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ అభ్యర్థి… పింఛన్ల పెంపుతో పేదలకు ఆర్థిక భరోసా కల్పించామంటూ ప్రచారం… సైకిల్, గ్లాస్ గుర్తులకు ఓటు వేయాలని విజ్ఞప్తి…

V10TV న్యూస్ డెస్క్ 30 అక్టోబర్, 2026 7:33 PMకి 4,602 వీక్షణలు
సంక్షేమమే అజెండాగా దాసరి ఉదయ్ శ్రీ ఎన్నికల ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పాయకాపురం, అక్టోబర్ 30: సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 82వ డివిజన్‌లో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. కూటమి బలపరిచిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాసరి ఉదయ్ శ్రీ శుక్రవారం డివిజన్ పరిధిలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వృద్ధులు, ఒంటరి మహిళల పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా కూటమి ప్రజల విశ్వాసాన్ని చూరగొందని పేర్కొన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని దాసరి ఉదయ్ శ్రీ పేర్కొన్నారు. కార్పొరేటర్ అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు చిన్నోడు, రాజేష్‌తో పాటు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

78వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కనకదుర్గ ఇంటింటి ప్రచారం

19 నిమిషాల క్రితం 6,894

పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు.. కౌంటింగ్‌పై ప్రత్యేక దృష్టి!

1 గంట క్రితం 6,986

సూర్యమణి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

1 గంట క్రితం
5,908

ఎన్నికల వేళ బెజవాడలో ఆంక్షల కంచె!

2 గంటల క్రితం 5,968