త్వరలో కొత్త రాజకీయ పార్టీ: విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
ప్రజల పక్షాన నిలిచి.. ప్రజల గొంతుక వినిపించేందుకే పార్టీ ఏర్పాటు... ఈ నెలలోనే తదుపరి రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి... తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి...

తిరుమల, ఆగస్టు 19: త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజల పక్షాన నిలిచి, ప్రజల సమస్యలపై వారి గొంతుకగా పనిచేసేందుకు కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం పనిచేసే లక్ష్యంతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
కొత్త పార్టీకి సంబంధించిన విధివిధానాలు, రాజకీయ కార్యాచరణ తదితర అంశాలపై ఈ నెలలోనే పూర్తి ప్రణాళికను వెల్లడిస్తానని చెప్పారు. దీంతో ఆయన తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.
దేశంపై ఎల్నినో ప్రభావం లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. దేశ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు పేర్కొన్నారు.

