తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
జిల్లామూడి, నియోజకవర్గాల్లో నీటమునిగిన పంటల పరిశీలన… వరద నష్టంపై అధికారులతో సమీక్ష… రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు తెలుసుకున్న చంద్రబాబు…

పల్నాడు, నవంబర్ 6 : పల్నాడు జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. బాపట్ల మండలం జిల్లామూడి, ప్రతిపాడు నియోజకవర్గంలోని నీటమునిగిన పంటపొలాలు, వరదలతో దెబ్బతిన్న కాలువలు, తదితర ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. రైతులతో మాట్లాడి తుపాను వల్ల జరిగిన పంట నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దెబ్బతిన్న డ్రెయిన్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

