ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ6, నవంబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

గెలిచినా విజయోత్సవాలు వద్దు!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు... ర్యాలీలు, ఊరేగింపులు, డీజేలు, బాణసంచాపై పూర్తి నిషేధం... నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు తప్పవు: సీపీ రాజశేఖరబాబు హెచ్చరిక...

V10TV న్యూస్ డెస్క్ 6 నవంబర్, 2026 1:38 PMకి 7,844 వీక్షణలు
గెలిచినా విజయోత్సవాలు వద్దు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 6: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు స్పష్టం చేశారు. శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు డప్పు వాయిద్యాలతో ప్రదర్శనలు నిర్వహించడం, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో మైక్ సెట్లు, డీజేలు వినియోగించడం పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163తో పాటు పోలీస్ చట్టంలోని సెక్షన్ 30 అమలులో ఉన్నాయని వెల్లడించారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలు చేపట్టినా, ప్రత్యర్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, ఇతర వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించినా సంబంధిత వ్యక్తులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. గెలుపోటములను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వీకరించాలని, ప్రజలంతా శాంతి సామరస్యాలను కాపాడుతూ పోలీసు శాఖకు సహకరించాలని కమిషనర్ రాజశేఖరబాబు విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ముత్యాలమ్మ సన్నిధిలో బొండా సిద్ధార్థ ప్రత్యేక పూజలు

32 నిమిషాల క్రితం 6,572

దీపావళి పేరుతో సైబర్ వల.. రూ.2 వేల ఆశ చూపి ఖాతాలకు కన్నం!

2 గంటల క్రితం 6,999

అత్తారింటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం!

2 గంటల క్రితం
7,466

బోటు ప్రమాదంలో ఏడుగురు జాలర్ల మృతి.. పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం

2 గంటల క్రితం 8,576