విజయవాడ పశ్చిమలో ‘మీ మార్ట్’ ప్రారంభం
ప్రత్తిపాటి శ్రీధర్‌తో కలిసి ప్రారంభించిన కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ... మార్కెట్ ధరల కంటే తక్కువకే నాణ్యమైన నిత్యావసర సరుకులు... తొలుత 60 రకాల వస్తువులు.. త్వరలో 250 రకాల సరుకులు అందుబాటులోకి...



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 — V10TV AP: రేషన్ డీలర్ల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ‘మీ మార్ట్’ను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించారు.
చెరువు సెంటర్లోని కోటా గురునాథం రేషన్ దుకాణంలో ఏర్పాటు చేసిన మీ మార్ట్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.


ప్రజలకు ఒకేచోట నాణ్యమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించడమే ఈ మార్టుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రస్తుతం 60 రకాల సరుకులతో ప్రారంభిస్తున్నామని, రాబోయే రోజుల్లో సుమారు 250 రకాల నాణ్యమైన వస్తువులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి దుర్గారావు, డీఎస్ఓ వాణి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, టీడీపీ నాయకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మండారి వెంకట్రావు, పలువురు రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

