ఆత్మహత్యా..? హత్యా..?
పరిచయస్తుడి ఇంట్లో వివాహిత మృతి.. కుటుంబ సభ్యుల అనుమానాలు... ఆత్మహత్యగా చెబుతున్న ఘటనపై హత్య ఆరోపణలు... ఫిర్యాదు ఆధారంగా అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు...

కృష్ణా జిల్లా: పరిచయస్తుడి ఇంట్లో ఓ వివాహిత ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కోడూరు మండలం మందపాకల గ్రామానికి చెందిన బెల్లంకొండ నాగ రమ్య (33) తన పరిచయస్తుడైన అద్దంకి నాగరాజు నివాస గృహం వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
అయితే తన సోదరిని నాగరాజే హత్య చేశాడని మృతురాలి సోదరుడు మల్లేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతికి అసలు కారణాలు ఏమిటి, ఆత్మహత్యా లేక మరేదైనా కారణం ఉందా అనే అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఫిర్యాదులో వచ్చిన ఆరోపణలపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

