చంద్రబాబుకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు
ముద్దేళ్లుగా సాగిన అక్రమ కేసులో చంద్రబాబు నిర్దోషిగా బయటపడ్డారని వ్యాఖ్య... నిజం గెలవాలని అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు... గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులపై మంత్రి నారా లోకేశ్ స్పందన...

అమరావతి: రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబు నాయుడును అక్రమ కేసులో నిర్బంధించారని, చివరకు నిజమే గెలిచిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అండగా నిలిచిన తెలుగు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
“తెలుగు జాతి మొత్తం ‘నిజం గెలవాలి’ అంటూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది. నిజం గెలిచింది. నిర్బంధం నుంచి చంద్రబాబు విడుదలయ్యారు” అని లోకేశ్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కక్షతో నమోదు చేసిన అక్రమ కేసులను న్యాయస్థానాలు కొట్టేశాయని ఆయన తెలిపారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ “తెలుగు జాతి మద్దతుకు మరోసారి కృతజ్ఞతలు” అని లోకేశ్ పేర్కొన్నారు.

