దుర్గమ్మ ట్రస్ట్ బోర్డులో సుస్మితకు ఆహ్వానం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం... దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ... ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై సలహాలు అందించనున్న సుస్మిత...

విజయవాడ, సెప్టెంబరు 8: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు సినీ నటుడు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమించారు.
ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై ఆమె సూచనలు, సలహాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
సుస్మిత నియామకంతో దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో ఆమె ప్రత్యేక ఆహ్వానితురాలిగా సేవలు అందించనున్నారు.

