జూడా సమ్మెకు జీడీఏపీ అధ్యక్షుడి మద్దతు
విజయవాడలో కొనసాగుతున్న ఏపీ జూడా సమ్మెకు డాక్టర్ ఇ. బాజీ శ్యామ్ కుమార్ సంఘీభావం... జూనియర్ డాక్టర్ల డిమాండ్లు న్యాయమైనవేనని వ్యాఖ్య... ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి...

విజయవాడ: నగరంలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజూడా) సమ్మెకు జీడీఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఇ. బాజీ శ్యామ్ కుమార్ మద్దతు తెలిపారు.
సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను కలిసి సంఘీభావం ప్రకటించారు. వైద్యుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
జూనియర్ డాక్టర్లు ప్రస్తావిస్తున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని కోరారు. ప్రజారోగ్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

