ఎండీ అఫిఫా కుటుంబానికి బొండా ఉమా పరామర్శ
రోడ్డు ప్రమాదంలో అఫిఫా మృతిపై తీవ్ర విచారం... ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి... అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా కుటుంబ సభ్యులను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పరామర్శించారు.
అఫిఫా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన బొండా ఉమా, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చిన్న వయస్సులోనే అఫిఫా మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, అఫిఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

