‘జెన్ జీ’ పేరుతో వైసీపీ డ్రామా: టీడీపీ
వెల్లంపల్లి, అవినాష్, మల్లాది కోసం మూడు కుర్చీలు సిద్ధం చేశామన్న టీడీపీ నేత ఫతావుల్లా... నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై మండిపాటు... ‘జెన్ జీ వార్’ అర్థం వైసీపీ నేతలకు తెలుసా అంటూ ఘాటు విమర్శలు...

విజయవాడ: డీఎస్సీ అంశంపై దమ్ముంటే వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని టీడీపీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ ఫతావుల్లా సవాల్ విసిరారు. విజయవాడ గణపతిరావు రోడ్డులోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రి నారా లోకేష్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఫతావుల్లా ఆరోపించారు. డీఎస్సీపై చర్చ కోసం వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు కోసం మూడు కుర్చీలు కూడా సిద్ధం చేశామని చెప్పారు. చర్చకు వస్తే ఎంపీ కేశినేని చిన్ని, పశ్చిమ టీడీపీ ఇన్చార్జి బుద్ధా వెంకన్న సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
వెల్లంపల్లి చేపట్టిన ర్యాలీపై కూడా ఫతావుల్లా విమర్శలు చేశారు. ర్యాలీని అడ్డుకుంటారని తెలిసే రూట్‌మ్యాప్ మార్చుకున్నారని ఆరోపించారు. ‘జెన్ జీ వార్’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో యువత, విద్యార్థుల కంటే వయసు పైబడిన వారే ఎక్కువగా కనిపించారని ఎద్దేవా చేశారు.
డీఎస్సీపై ఆన్లైన్లో అయినా చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ ప్రకటించినప్పటికీ వైసీపీ నుంచి ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఇకనైనా వైసీపీ నేతలు నారా లోకేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఫతావుల్లా హెచ్చరించారు.
mao head line

