ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రితో బొండా ఉమా వన్-టు-వన్ భేటీ.. విజయవాడ అభివృద్ధిపై కీలక చర్చ

విజయవాడ పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి రావాలని సీఎంను ఆహ్వానించిన బొండా ఉమా... త్వరలో తేదీ ఖరారు చేయాలని పీఎస్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు... అక్టోబర్‌లోపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సానుకూల సంకేతాలు...

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 5:51 PMకి 123 వీక్షణలు
ముఖ్యమంత్రితో బొండా ఉమా వన్-టు-వన్ భేటీ.. విజయవాడ అభివృద్ధిపై కీలక చర్చ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 5 (వి10టివి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఉండవల్లిలో ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా వన్-టు-వన్‌గా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ అభివృద్ధి, పేదల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎంతో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

విజయవాడ పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా హాజరుకావాలని బొండా ఉమా కోరగా, త్వరలోనే తేదీని ఖరారు చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శికి సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు వెల్లడించారు.

అదేవిధంగా, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని, అక్టోబర్‌లోపు కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అలాగే డివిజన్ల పెంపు, మేయర్‌ను ప్రత్యక్షంగా ఎన్నిక చేసే విధానంపై కూడా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

విజయవాడ నగర అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సుప్రీంకోర్టు జడ్జి పేరుతో సైబర్ మోసం.. మచిలీపట్నం మహిళకు రూ.1.43 కోట్ల టోకరా

4 గంటల క్రితం 771

ఏపీ అస్త్రం యాప్‌ ప్రతి ఒక్కరూ వినియోగించాలి: డీసీపీ షిరీన్ బేగం

4 గంటల క్రితం 2,463

బెంజ్ సర్కిల్ ట్రాఫిక్‌కు చెక్.. ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించండి

4 గంటల క్రితం 175

పోలీస్ ఉద్యోగాల భర్తీపై జగన్‌కు నిరుద్యోగ యువత వినతి

5 గంటల క్రితం 666