ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ27, అక్టోబర్ 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

అభివృద్ధి, సంక్షేమమే మా శ్రీరామరక్ష!

గత 27 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు... 1వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుడిపాటి సౌజన్యకు మద్దతుగా ప్రచారం... కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి... ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

V10TV న్యూస్ డెస్క్ 27 అక్టోబర్, 2026 10:59 AMకి 3,576 వీక్షణలు
అభివృద్ధి, సంక్షేమమే మా శ్రీరామరక్ష! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 27: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 1వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మంగళవారం ఉదయం ఊర్మిళానగర్‌లోని కృష్ణ హోటల్ కట్ట వద్ద ప్రారంభమైన ప్రచారంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి గుడిపాటి సౌజన్యతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత 27 నెలలుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడం, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. సింగ్‌నగర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పరిష్కారం చూపామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. డివిజన్ అభివృద్ధి, ప్రజాసేవ లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచిన గుడిపాటి సౌజన్యకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బొండా ఉమా విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

లింగమనేని రమేష్‌తో వంగవీటి రాధా భేటీ

1 గంట క్రితం 3,270

80వ డివిజన్‌లో వైసీపీ ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 3,677

'ఆర్నబ్' తుఫాన్‌పై ఎన్టీఆర్ జిల్లా హైఅలర్ట్!

2 గంటల క్రితం 3,272

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 45 సార్లు బాంబు బెదిరింపులు!

3 గంటల క్రితం 2,691